కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW.ORG వెబ్‌సైట్‌

వేరొక భాషలో సమాచారాన్ని కనుగొనండి

వేరొక భాషలో సమాచారాన్ని కనుగొనండి

మీరొక భాషను నేర్చుకుంటుంటే లేక jw.org వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని వేరొక భాష మాట్లాడే వారికి చూపించాలనుకుంటే, మీరు కోరుకునే భాషలో సమాచారాన్ని కనుగొనేందుకు కింద వివరించిన మూడు పద్ధతుల్లో ఒక దానిని ఉపయోగించుకోండి.

 వెబ్‌సైట్‌ను వేరొక భాషలోకి మార్చుకోండి

jw.org వెబ్‌సైట్‌లో ఉన్న అన్ని భాషల పూర్తి లిస్టుని చూసేందుకు లాంగ్వేజ్‌ పిక్కర్‌ క్లిక్‌ చేయండి.

లిస్టులో ఉన్న ప్రతీ భాషకు దాని పేరుకు ఎడమవైపున ఒక చిహ్నం ఉంటుంది:

  • వెబ్‌సైట్‌ గాని అందులోని కొంత భాగం గాని, ఆ భాషలోకి అనువదించి ఉంటే దాన్నే మీ వెబ్‌సైట్‌ భాషగా మార్చుకునేందుకు ఆ భాష పేరును క్లిక్‌ చేయండి.

  • మీరు చూడాలనుకున్న భాషలో వెబ్‌సైట్‌ ఇంకా అనువాదం కాలేదు కానీ, డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు ప్రచురణలు మాత్రం ఉంటే, ఆ ప్రచురణల లిస్టును చూసేందుకు ఆ భాషను క్లిక్‌ చేయండి.

  • ఇది సంజ్ఞా భాష.

    మీరు ఎంచుకున్న సంజ్ఞా భాషలో jw.org వెబ్‌సైట్‌లో కొంత భాగం అనువాదం అయివుంటే, ఆ వెబ్‌సైట్‌ మీరు ఎంపిక చేసుకున్న భాషలో కనిపిస్తుంది.

    మీరు ఎంచుకున్న సంజ్ఞా భాషలోకి jw.org వెబ్‌సైట్‌ ఇంకా అనువాదం కాకపోయివుంటే, ఆ సంజ్ఞా భాషలో ఉన్న ప్రచురణల లిస్టు మీకు కనిపిస్తుంది.

లిస్టులో కొన్ని వందల భాషల పేర్లు ఉంటాయి కాబట్టి, మీకు కావల్సిన భాషను సులువుగా కనుగొనేందుకు కింది వాటిలో ఓ పద్ధతిని ఉపయోగించుకోండి:

  • మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి: మీరు ఇటీవల ఎంపిక చేసుకున్న నాలుగు భాషలు, లిస్టు పైభాగంలో కనబడతాయి.

  • భాష పేరును టైప్‌ చేయండి: మీరు చూడాలనుకునే భాష పేరులోని కొన్ని అక్షరాలను ఆ భాషలోగానీ, మీ భాషలోగానీ టైప్‌ చేయండి. ఉదాహరణకు, మీ సైట్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లీషు అయ్యుండి మీరు తెలుగులో ప్రచురణలను చూడాలనుకుంటే, మీరు “Telugu” లేక “తెలుగు” అని టైప్‌ చేయవచ్చు. మీరు ఒక్కో అక్షరాన్ని టైప్‌ చేస్తుండగా, మీరు టైప్‌ చేసిన దానికి సరిపడే భాషల పేర్లున్న చిన్న లిస్టు మాత్రమే కనబడుతుంది.

 వెబ్‌పేజీని వేరొక భాషలో చూడండి

1వ పద్ధతి: డ్రాప్‌-డౌన్‌ ఆప్షన్‌ ఉన్న వెబ్‌పేజీల్లో ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

మీరు చదవాలనుకున్న లేదా ఇతరులతో పంచుకోవాలనుకున్న ఆర్టికల్‌కు వెళ్లండి. తర్వాత, భాష అనే డ్రాప్‌-డౌన్‌ లిస్టులో నుండి ఓ భాషను ఎంపిక చేసుకుంటే ఆ భాషలోని ఆర్టికల్‌ను చూడగలుగుతారు. (భాష అనే డ్రాప్‌-డౌన్‌ లిస్టులో మీరు వెతుకుతున్న భాష లేకపోతే, ఆర్టికల్‌ను ఇంకా ఆ భాషలో ప్రచురించలేదని అర్థం.)

సలహా: భాష అనే డ్రాప్‌-డౌన్‌ లిస్టులో ఆ భాష పేరుకు ఎడమవైపు ఉన్న హెడ్‌ఫోన్ల చిహ్నం, ఆ భాషలో ఆ ఆర్టికల్‌ ఆడియో ఉందని సూచిస్తుంది.

భాష అనే డ్రాప్‌-డౌన్‌ లిస్టును ఉపయోగించి వేరే భాషలో ఒక ఆర్టికల్‌ను చూస్తుంటే, ఆ ఆర్టికల్‌ మాత్రమే మీరు చూస్తున్న భాషలో కనబడుతుంది. మిగిలిన వెబ్‌సైట్‌ అంతా మీరు ఎంపికచేసుకున్న భాషలోనే కనబడుతుంది.

2వ పద్ధతి: మీరు చదువుతున్న ఆర్టికల్‌కు భాష అనే డ్రాప్‌-డౌన్‌ లిస్టు లేకపోతే, మీకు కావల్సిన భాషలోకి వెబ్‌సైట్‌ను మార్చుకునేందుకు లాంగ్వేజ్‌ పిక్కర్‌ ఉపయోగించండి. ఒకవేళ మీరు చదవాలనుకునే ఆర్టికల్‌ మీరు ఎంచుకున్న భాషలో ఉంటే, అది చూపిస్తుంది. లేకపోతే, మీరు ఎంచుకున్న భాషలోని హోమ్‌ పేజీకి మిమ్మల్ని తీసుకెళ్తుంది.

 వేరొక భాషలో ప్రచురణను కనుగొనండి

ప్రచురణలు అనే టాబ్‌లో > అందుబాటులో ఉన్నవి అనే భాగాన్ని క్లిక్‌ చేయండి. డ్రాప్‌-డౌన్‌ లిస్టులో నుండి ఒక భాషను ఎంపిక చేసుకొని వెతుకు బటన్‌ను క్లిక్‌ చేయండి.

మీకు కావల్సిన భాషను సులువుగా కనుగొనేందుకు కింది పద్ధతుల్లో ఒక దానిని ఉపయోగించండి:

  • మీకు ఇష్టమైన భాషను ఎంపిక చేసుకోండి: మీరు ఇటీవల ఉపయోగించిన నాలుగు భాషలు పైభాగంలో కనబడతాయి.

  • భాష పేరును టైప్‌ చేయండి: మీరు చూడాలనుకునే భాష పేరులోని కొన్ని అక్షరాలను ఆ భాషలోగానీ, మీ భాషలోగానీ టైప్‌ చేయండి. ఉదాహరణకు, మీ సైట్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లీషు అయ్యుండి మీరు తెలుగు భాషలో ప్రచురణలను చూడాలనుకుంటే, మీరు “Telugu” లేక “తెలుగు” అని టైప్‌ చేయవచ్చు. మీరు ఒక్కో అక్షరాన్ని టైప్‌ చేస్తుండగా, మీరు టైప్‌ చేసిన దానికి సరిపడే భాషల పేర్లున్న చిన్న లిస్టు మాత్రమే కనబడుతుంది.

మీరు ఎంచుకున్న భాషలో అనేక ప్రచురణలు ఉంటే, అందుబాటులో ఉన్నవి అనే బాక్స్‌ను క్లిక్‌ చేసినప్పుడు ఆ పేజీలో సరిపడ కొన్నిటిని మాత్రమే అది మీకు చూపిస్తుంది. కాబట్టి అదనపు ప్రచురణలు చూడాలనుకుంటే ప్రచురణలు పేజీ మెనులో ఒకదానిపై క్లిక్‌ చేస్తే (ఉదాహరణకు, పుస్తకాలు & బ్రోషుర్‌లు లేక పత్రికలు) ఆ విధమైన ప్రచురణలు చూడవచ్చు.

మీరు ఎంచుకున్న భాషలో మీకు కావాల్సిన ప్రచురణలు లేకపోతే ఆ పేజీలో ఉన్న ఇతర ప్రచురణల లింకులను చూపిస్తుంది.