కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు క్రైస్తవులా?

యెహోవాసాక్షులు క్రైస్తవులా?

 అవును. మేము క్రైస్తవులం. దానికి కారణాలు ఇవి:

  •   మేము యేసుక్రీస్తు బోధలను పాటించడానికి, ఆయన అడుగుజాడల్లో నడవడానికి కృషి చేస్తాం.—1 పేతురు 2:21.

  •   ‘ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము,’ యేసు నామమున మాత్రమే రక్షణ పొందుతామని మేము నమ్ముతాం.—అపొస్తలుల కార్యములు 4:12.

  •   ఒక వ్యక్తి యేసు నామమున బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అవుతాడు.—మత్తయి 28:18, 19.

  •   మేము యేసు నామమున ప్రార్థిస్తాం.—యోహాను 15:16.

  •   యేసు శిరస్సని, ప్రతీ పురుషుని మీద ఆయన అధికారం పొందాడని మేము నమ్ముతాం.—1 కొరింథీయులు 11:3.

 అయితే, మాకూ క్రైస్తవులమని చెప్పుకునే వేరే మత గుంపులకూ ఎన్నో విషయాల్లో తేడా ఉంది. ఉదాహరణకు, యేసు త్రిత్వంలో భాగం కాదు, ఆయన దేవుని కుమారుడు అని బైబిలు బోధిస్తోందని మేము నమ్ముతాం. (మార్కు 12:29) ఆత్మకు చావులేదనే సిద్ధాంతాన్ని మేము నమ్మం, దేవుడు ప్రజలను నరకంలో వేసి యుగయుగాలు శిక్షిస్తాడనడానికి ఎలాంటి లేఖన ఆధారం లేదు. మత కార్యకలాపాల్లో నాయకత్వం వహించే వాళ్లకు ఇతరులకన్నా ఉన్నతులుగా చూపించే బిరుదులు ఉండాలని లేఖనాలు చెప్పడంలేదు.—ప్రసంగి 9:5; యెహెజ్కేలు 18:4; మత్తయి 23:8-10.