కంటెంట్‌కు వెళ్లు

విడాకుల విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?

విడాకుల విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?

పెళ్లి, విడాకుల గురించి బైబిలు చెప్తున్న విషయాలకు మేము కట్టుబడి ఉంటాం. ఒక స్త్రీ, ఒక పురుషుడు శాశ్వతకాలం కలిసి ఉండడానికి దేవుడు చేసిన ఏర్పాటే పెళ్లి. విడాకులు తీసుకునేవాళ్లు లైంగిక పాపాల కారణంగా మాత్రమే విడాకులు తీసుకోవచ్చని లేఖనాలు చెప్తున్నాయి.—మత్తయి 19:​5, 6, 9.

విడిపోవాలనుకుంటున్న భార్యాభర్తలకు యెహోవాసాక్షులు సహాయం చేస్తారా?

చాలా విధాలుగా సహాయం చేస్తారు.

  • ప్రచురణలు. వీటిలో క్రమంగా వచ్చే సమాచారం, మేము ఇక కలిసుండడం అసాధ్యం అని అనుకునే భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురం చేసుకునేలా సహాయం చేస్తుంది. ఉదాహరణకు, “వివాహబంధానికి కట్టుబడి ఉండడం,” “క్షమాపణ ఎలా అడగాలి”, “నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవచ్చు?” వంటి ఆర్టికల్స్‌ చూడండి.

  • మీటింగ్స్‌. పెళ్లి విషయంలో బైబిలు ఇస్తున్న ఉపయోగపడే సలహాల్ని వారంవారం జరిగే మీటింగ్స్‌లో, సమావేశాల్లో మేము చర్చిస్తాం.

  • పెద్దలు. సంఘ పెద్దలు ఎఫెసీయులు 5:​22-​25 వంటి లేఖనాలను ఉపయోగిస్తూ పెళ్లైన దంపతులకు అవసరమైన సహాయాన్ని చేస్తారు.

ఒక యెహోవాసాక్షి విడాకులు తీసుకోవడాన్ని సంఘపెద్దలు ఆమోదించాలా?

అవసరం లేదు. భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్యలను పరిష్కరించమని సంఘపెద్దల్ని అడిగినప్పటికీ, ఆ భార్యాభర్తలు ఏమి చేయాలో చెప్పే అధికారం సంఘపెద్దలకు ఉండదు. (గలతీయులు 6:5) కానీ, ఒకవేళ ఎవరైనా లేఖనాల ఆధారంగా కాకుండా వేరే కారణంతో విడాకులు తీసుకుంటే, వాళ్లు సంఘంలో ప్రత్యేక సేవావకాశాలు కోల్పోతారు. అంతేకాదు లేఖనాల ఆధారంగా మళ్లీ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా వాళ్లకు ఉండదు.—1 తిమోతి 3:​1, 5, 12.

వేరైపోవడం గురించి యెహోవాసాక్షుల అభిప్రాయం ఏమిటి?

పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా భార్యాభర్తలు కలిసే ఉండాలని బైబిలు ప్రోత్సహిస్తుంది. (1 కొరింథీయులు 7:​10-​16) పట్టుదలగా ప్రార్థించడం ద్వారా, బైబిలు సూత్రాల్ని పాటించడం ద్వారా, ప్రేమ చూపించడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారమౌతాయి.​—1 కొరింథీయులు 13:​4-8; గలతీయులు 5:​22.

కానీ కొంతమంది క్రైస్తవులు తమకు ఎదురైన కొన్ని తీవ్రమైన పరిస్థితుల వల్ల తమ వివాహజత నుండి వేరైపోయి దూరంగా ఉండాలని అనుకున్నారు. ఆ పరిస్థితులు ఏవంటే:

  • కావాలనే తమను పట్టించుకోక పోయినప్పుడు.​—1 తిమోతి 5:8.

  • తీవ్రమైన శారీరక హింసకు లోనైప్పుడు.​—కీర్తన 11:5.

  • వాళ్ల ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, అంటే యెహోవాను ఆరాధించడం అసాధ్యమైపోయిన పరిస్థితి వచ్చినప్పుడు. ఉదాహరణకు భార్య లేదా భర్త తమ వివాహజతను, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైనగా ఏదైనా పని చేయమని ఒత్తిడి చేయవచ్చు. అప్పుడు, బెదిరింపుకు గురైన ఆ వివాహజత “లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు” అనుకుని వేరైపోవాలని నిర్ణయించుకోవచ్చు.​—అపొస్తలులు కార్యములు 5:​29.