కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవుడు ఎక్కడ ఉన్నాడు?”

“దేవుడు ఎక్కడ ఉన్నాడు?”

“ఈ ప్రశ్న ఎక్కువగా తలెత్తుతుంది: దేవుడు ఎక్కడ ఉన్నాడు?”​—పోప్‌ బెనెడిక్ట్‌ XVI, పోలాండ్‌లో ఉన్న ఆష్‌విట్స్‌ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపును సందర్శిస్తున్నప్పుడు అన్నాడు.

విషాద సంఘటనలు జరిగినప్పుడు, దేవుడు ఉన్నాడా? అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేదా మీ జీవితంలో జరిగిన విషాదం, దేవుడు మీ గురించి అసలు పట్టించుకుంటాడా అని అనుకునేలా చేసిందా?

బహుశా మీరు కూడా అమెరికాలో ఉంటున్న షీలా అనే ఆమెలా అనుకుని ఉండవచ్చు. ఆమె చాలా దైవభక్తి గల కుటుంబంలో పెరిగింది. ఆమె ఇలా చెప్తుంది: “దేవుడు మనల్ని చేశాడు కాబట్టి నాకు ఆయనంటే చిన్నతనం నుండి ఇష్టం ఉండేది. కానీ నేను ఆయనకు సన్నిహితంగా ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన నన్ను చూస్తున్నాడు, కానీ దూరం నుండి మాత్రమే చూస్తున్నాడు అనుకునేదాన్ని. దేవునికి నేనంటే ఇష్టంలేదు అని నేను అనుకోలేదు, అలాగని ఆయన నా గురించి పట్టించుకుంటాడు అని కూడా నేను నమ్మలేదు.” షీలాకు ఆ సందేహాలు ఎందుకు ఉన్నాయి? ఆమె ఇలా చెప్తుంది: “ఒకదాని తర్వాత ఒకటిగా మా కుటుంబంలో విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పుడు దేవుడు మాకు అస్సలు సహాయం చేయడం లేదు అని అనిపించేది.”

షీలాలానే, మీరు కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడని నమ్ముతుండవచ్చు. కానీ ఆయన నిజంగా మీ గురించి పట్టించుకుంటాడా అని మీరు ఆలోచిస్తుండవచ్చు. నీతిమంతుడైన యోబుకు సృష్టికర్త శక్తి మీద, ఆయన జ్ఞానం మీద నమ్మకం ఉంది, కాని అతనికీ ఇలాంటి సందేహాలే ఉన్నాయి. (యోబు 2:3; 9:4) ఒక విషాదం తర్వాత మరో విషాదం వల్ల యోబు నలిగిపోయినప్పుడు, దగ్గర్లో ఏ ఓదార్పూ కనపడక ఆయన దేవున్ని ఇలా అడిగాడు: “నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?”—యోబు 13:24.

బైబిలు ఏమి చెప్తుంది? విషాదం జరగడానికి దేవుడే కారణమా? ఆయన మనుషులందరి గురించి, ప్రత్యేకంగా మనలో ప్రతి ఒక్కరి గురించి పట్టించుకుంటాడని అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మన గురించి ఆలోచిస్తే, దేవుడు మనల్ని చూస్తాడా, అర్థం చేసుకుంటాడా, మనతో పాటు మన భావాలను పంచుకుంటాడా, లేదా మన సమస్యల్లో సహాయం చేస్తాడా. ఈ విషయాల గురించి మనలో ఎవరిమైనా నిజంగా తెలుసుకోగలమా?

తర్వాత ఆర్టికల్స్‌లో దేవునికి మన మీద ఉన్న శ్రద్ధ గురించి సృష్టి ఏమి నేర్పిస్తుందో చూస్తాం. (రోమీయులు 1:20) తర్వాత బైబిలు దేవుని శ్రద్ధ గురించి ఏమి నేర్పిస్తుందో పరిశీలిస్తాం. ఆయన సృష్టి ద్వారా, ఆయన వాక్యం ద్వారా మీరు ఆయన గురించి తెలుసుకునేకొద్దీ, ఆయన మన గురించి పట్టించుకుంటాడనే నమ్మకం పెరుగుతుంది.—1 యోహాను 2:3; 1 పేతురు 5:7.