కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

కొందరి నమ్మకాలు: దేవుని రాజ్యం మన హృదయంలో ఉంటుందని కొంతమంది అంటారు; మనుషులందరూ కలిసి భూమ్మీద శాంతి, న్యాయం కోసం చేసే ప్రయత్నాల ఫలితమే దేవుని రాజ్యం అని ఇంకొంతమంది అంటారు. మీరేమంటారు?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, . . . అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును.” (దానియేలు 2:44) దేవుని రాజ్యం ఒక నిజమైన ప్రభుత్వం.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవుని రాజ్య పరిపాలన పరలోకం నుండి జరుగుతుంది. —మత్తయి 10:7; లూకా 10:9.

  • పరలోకంలోనూ, భూమ్మీదనూ తన చిత్తం జరిగేలా దేవుడు ఈ రాజ్యాన్ని ఉపయోగిస్తాడు.—మత్తయి 6:9, 10.

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది?

మీరేమంటారు?

  • ఎవరికీ తెలీదు

  • త్వరలో

  • అసలు రాదు

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

“ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) రాజ్య సువార్త పూర్తిగా ప్రకటించబడిన తర్వాత, ఆ రాజ్యం ఇప్పుడున్న చెడు వ్యవస్థకు అంతం తీసుకొస్తుంది.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవుని రాజ్యం సరిగ్గా ఎప్పుడు వస్తుందో భూమ్మీద ఎవరికీ తెలీదు.—మత్తయి 24:36.

  • దేవుని రాజ్యం త్వరలోనే వస్తుందని బైబిలు ప్రవచనాలు చూపిస్తున్నాయి.—మత్తయి 24:3, 7, 8, 12. (wp16-E No. 5)