కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచమంతా గందరగోళం

3 | బంధాల్ని బలపర్చుకోండి

3 | బంధాల్ని బలపర్చుకోండి

ఎందుకో తెలుసా?

ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు పెరిగేకొద్దీ ప్రేమలు తగ్గిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి.

  • కొంతమంది తమ స్నేహితుల్ని దూరం పెడుతున్నారు.

  • భార్యాభర్తలైతే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు.

  • తల్లిదండ్రులు తమ పిల్లల ఫీలింగ్స్‌ని పట్టించుకోకుండా, వాళ్ల టెన్షన్‌లో వాళ్లుంటున్నారు.

మీకు తెలుసా?

  • స్నేహితులు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యం బాలేకపోయినా, మనసు బాలేకపోయినా వాళ్లు తోడుగా ఉంటారు.

  • చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, ఆ ఒత్తిడివల్ల కుటుంబంలో మీరు ఊహించని సమస్యలు తలెత్తవచ్చు.

  • పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో పిల్లలు న్యూస్‌లో విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ వాళ్లు కంగారు పడవచ్చు, భయపడవచ్చు.

ఇప్పుడు ఏం చేయాలి?

బైబిలు ఇలా చెప్తుంది: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.

స్నేహితులు మనకు ధైర్యం చెప్పి, తెలివైన సలహాలిస్తారు. వాళ్లిచ్చే అండతో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోవడం తేలికౌతుంది.