కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | బైబిల్ని నిజంగా దేవుడే ఇచ్చాడా?

బైబిల్లో అన్ని విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి

బైబిల్లో అన్ని విషయాలు ఖచ్చితంగా ఉన్నాయి

సైన్స్‌పరంగా ఖచ్చితమైనది

బైబిలు ఒక సైన్స్‌ పుస్తకం కాకపోయినా, ప్రకృతి విషయాల్లో ఖచ్చితమైన వివరాలను ఇచ్చింది. వాతావరణ శాస్త్రంలో, జన్యు శాస్త్రంలో కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

వాతావరణ శాస్త్రం—వర్షం ఎలా వస్తుంది

వాతావరణ శాస్త్రం

బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడు భూమినుండి నీళ్లు తీసుకొని దాన్ని వర్షంగా మారుస్తాడు. ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు.”—యోబు 36:27, 28, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌వర్షన్‌.

నీటి చక్రం గురించి బైబిలు మూడు ముఖ్యమైన విషయాలు వివరిస్తుంది. సూర్యుని నుండి వేడి వచ్చేలా చేసిన దేవుడు “నీళ్లు తీసుకొని” (1) ఆవిరి రూపంలో పైకి వెళ్లేలా చేస్తాడు. తర్వాత ఆ ఆవిరి (2) ఘనీభవించినప్పుడు మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు (3) వర్షం రూపంలో లేదా వేరే రూపంలో కిందకు కురుస్తాయి. వాతావరణ శాస్త్రజ్ఞులు ఇప్పటికీ వర్షానికి సంబంధించిన వివరాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆసక్తికరంగా బైబిలు ఇలా ప్రశ్నిస్తుంది: “మేఘములు వ్యాపించు విధమును . . . ఎవడైనను గ్రహింపజాలునా?” (యోబు 36:29) నీటి చక్రం సృష్టికర్తకు తెలుసు. అందుకే బైబిల్లో ఆ ఖచ్చితమైన వివరాలను మనుషులతో రాయించాడు. అంతేకాదు, ఈ సాధారణ ప్రక్రియను మనుషులు సైన్స్‌ ద్వారా వివరించడానికి చాలాకాలం ముందే దేవుడు ఈ విషయాల గురించి బైబిల్లో రాయించాడు.

జన్యుశాస్త్రం—గర్భంలో శిశువు ఎలా పెరుగుతుంది

జన్యుశాస్త్రం

బైబిల్లో కొన్ని భాగాల్ని రాసిన దావీదు రాజు దేవునితో ఇలా అన్నాడు: “యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు. ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.” (కీర్తన 139:16, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌వర్షన్‌) ముందుగా రాసిన ఒక “గ్రంథం” లేదా ఒక ప్రణాళిక ప్రకారం పిండం పెరుగుతుందని కావ్య భాషలో దావీదు చెప్పాడు. 3,000 సంవత్సరాల క్రితమే ఈ విషయం గురించి రాయడం ఆశ్చర్యంగా ఉంది.

1860 సంవత్సరానికి దగ్గర్లో వృక్షశాస్త్రవేత్త అయిన గ్రెగర్‌ మెన్‌డల్‌ కనిపెట్టేంత వరకు జన్యువులకు సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలియలేదు. మనుషుల జీనోమ్‌ ఏ క్రమంలో ఉందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన 2003 ఏప్రిల్‌లో పూర్తయింది. జీనోమ్‌లో మనుషుల శరీర నిర్మాణానికి సంబంధించిన జన్యుపరమైన సమాచారమంతా ఉంటుంది. నిఘంటువులో అక్షరాలు, అక్షరాల నుండి వచ్చే పదాలు ఎలాగైతే వరుసగా ఉంటాయో అలాగే మన జీన్స్‌లో ఉండే జన్యు సూచనలు ఒక క్రమంలో ఉంటాయి. ఆ సూచనల ఆధారంగా పిండంలో ఉండే భాగాలు అంటే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాళ్లు ఖచ్చితమైన క్రమంలో సరైన సమయానికి ఏర్పడి పెరుగుతాయి. అందుకే శాస్త్రవేత్తలు ఈ జీనోమ్‌ని “జీవ గ్రంథం” అని వర్ణించడంలో అర్థం ఉంది. ఈ విషయాల గురించి బైబిలు రచయిత అయిన దావీదు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు? ఆయనే వినయంగా ఇలా చెప్తున్నాడు: “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది.” a2 సమూయేలు 23:2.

భవిష్యత్తు గురించి ఖచ్చితమైన వివరాలు ఇస్తుంది

రాజ్యాలు, పట్టణాలు ఎప్పుడు, ఎలా, ఎంత వరకు ఎదుగుతాయో లేదా నాశనం అవుతాయో తెలుసుకోవడం చాలా కష్టం, నిజానికి అసాధ్యం. కానీ బైబిలు ముందుగానే బలమైన రాజ్యాల, పట్టణాల పతనం గురించి చాలా వివరంగా చెప్పింది. రెండు ఉదాహరణలను చూద్దాం.

బబులోను ఓడిపోయి, ఎవరూ నివసించకుండా అయిపోతుంది

పశ్చిమ ఆసియా భాగంలో ఎన్నో సంవత్సరాలు శక్తివంతంగా ఉన్న సామ్రాజ్యానికి ప్రాచీన బబులోను కేంద్రం. ఒక సమయంలో ప్రపంచంలోనే అది అతి పెద్ద పట్టణం. కానీ 200 సంవత్సరాల ముందే బైబిలు రచయిత అయిన యెషయా దేవుని ప్రేరేపణతో బబులోనును కోరెషు అనే రాజు జయిస్తాడని, ప్రజలు ఎప్పటికీ నివసించని ప్రదేశంగా అది మారిపోతుందని ప్రవచించాడు. (యెషయా 13:17-20; 44:27, 28; 45:1, 2) మరి ఆయన చెప్పినట్లే జరిగిందా?

చరిత్ర

క్రీ.పూ. 539 అక్టోబరు నెలలో ఒక రాత్రి, కోరెషు రాజు బబులోనును జయించాడు. చుట్టుపక్కల సారవంతమైన ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే కాలువలు నిర్లక్ష్యం వల్ల ఆగిపోయాయి. క్రీ.శ. 200 సంవత్సరానికల్లా ఆ ప్రాంతం నిర్మానుష్యంగా తయారైందని అన్నారు. ఈ రోజు వరకు బబులోను శిథిలాలుగా ఉంది. బైబిలు ముందే చెప్పినట్లు బబులోను ‘పాడైపోయింది.’ —యిర్మీయా 50:13.

ఈ బైబిలు రచయిత ముందు జరగబోయే విషయాలు ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసుకున్నాడు? దానికి జవాబు బైబిలే చెప్తుంది, “బబులోను విషయంలో . . . ఈ సందేశాన్ని ఆమోజు కుమారుడు యెషయాకు దేవుడు చూపించాడు.”—యెషయా 13:1, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌వర్షన్‌.

నీనెవె “ఆరిపోయిన యెడారివలె” అవుతుంది

నీనెవె అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని, అందమైన భవనాలకు ప్రసిద్ధి. ఆ పట్టణం పెద్దపెద్ద వీధులకు, చక్కని పార్కులకు, గుళ్లకు, పెద్దపెద్ద రాజ భవనాలకు పెట్టింది పేరు. అయినప్పటికీ ఆ గొప్ప పట్టణం “ఆరిపోయిన యెడారివలె” పాడైపోతుందని జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు.—జెఫన్యా 2:13-15.

క్రీ.పూ. ఏడవ శతాబ్దంలో బబులోనీయుల, మాదీయుల సైన్యాలు కలిసి నీనెవె పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశాయి. ఒక రెఫరెన్సు ప్రకారం జయించబడిన పట్టణం “2500 సంవత్సరాలు మరువబడింది.” కొంతకాలానికి, అసలు నీనెవె అనే పట్టణం నిజంగా ఉండేదా అని ప్రజలు సందేహించారు! కానీ 1850 సంవత్సరం దగ్గర్లో పురావస్తు శాస్త్రజ్ఞులు నీనెవె శిథిలాలను బయటకు తీశారు. ఇప్పుడు ఆ ప్రాంతం పాడైపోతూ ధ్వంసం అవుతుంది. గ్లోబల్‌ హెరిటేజ్‌ ఫండ్‌ ఇలా హెచ్చరిస్తుంది: “నీనెవె పురాతన శిథిలాలు మళ్లీ శాశ్వతంగా కనుమరుగైపోవచ్చు.”

జెఫన్యాకు ఈ సమాచారం ముందే ఎక్కడ నుండి వచ్చింది? “జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు” అని ఆయనే చెప్పాడు.—జెఫన్యా 1:1.

జీవితం గురించిన ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు జవాబులు ఇస్తుంది

జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు సరైన జవాబులు ఇస్తుంది. ఈ ఉదాహరణలు పరిశీలించండి.

ప్రపంచంలో ఇంత చెడుతనం, బాధ ఎందుకు ఉన్నాయి?

చెడుతనం, బాధ గురించి లేఖనాల్లో అన్ని చోట్ల కనిపిస్తుంది. బైబిలు ఇలా వివరిస్తుంది:

  1. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”ప్రసంగి 8:9.

    అర్హత లేనివాళ్లు, అవినీతిపరులు అయిన మనుషుల పరిపాలన వల్ల ప్రజలకు చెప్పలేనన్ని బాధలు వస్తున్నాయి.

  2. కాలవశము చేత, అనూహ్యంగా జరిగే సంఘటనలు అందరికి కలుగుతున్నాయి.ప్రసంగి 9:11.

    అనూహ్యంగా జరిగే సంఘటనలు ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు. అంటే యాక్సిడెంట్లు, తీవ్రమైన జబ్బులు, విపత్తులు లాంటివి.

  3. “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి.”రోమీయులు 5:12.

    దేవుడు మొదటి స్త్రీ, పురుషుడిని సృష్టించినప్పుడు మనుషుల్లో అపరిపూర్ణత, మరణం లాంటివి లేవు. కావాలని సృష్టికర్త చెప్పిన మాట వినకపోవడం వల్ల ‘పాపము లోకంలోకి ప్రవేశించింది.’

ప్రజలు బాధలు ఎందుకు పడుతున్నారో బైబిలు చెప్తుంది. అంతేకాకుండా, దేవుడు చెడును తీసేసి, “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు” అనే వాగ్దానం కూడా బైబిలు ఇస్తుంది.—ప్రకటన 21:3, 4.

చనిపోయాక మనకు ఏమి అవుతుంది?

మరణం స్పృహలో లేని, ఏమి చేయలేని స్థితిని సూచిస్తుందని బైబిలు వివరిస్తుంది. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని ప్రసంగి 9:5 చెప్తుంది. చనిపోయిన వాళ్ల “సంకల్పములు నాడే నశించును.” (కీర్తన 146:4) అంటే మెదడు చేసే పనులు అన్ని చివరికి మన జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి చనిపోయాక మనం పనిచేయలేము, తెలుసుకోలేము లేదా ఆలోచించలేము, మనకు ఏ భావాలు ఉండవు.

చనిపోయినవాళ్ల స్థితితో పాటు ఇంకొన్ని విషయాల గురించి బైబిలు చెప్తుంది. చనిపోయినవాళ్లు మరణమనే గాఢనిద్రలో నుండి పునరుత్థానం వల్ల తిరిగి లేస్తారనే సంతోషకరమైన విషయాన్ని కూడా వివరిస్తుంది.—హోషేయ 13:14; యోహాను 11:11-14.

జీవితానికి ఉన్న అర్థం ఏమిటి?

యెహోవా దేవుడు స్త్రీని, పురుషుడిని సృష్టించాడని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 1:27) అందుకే మొదటి పురుషుడైన ఆదామును “దేవుని కొడుకు” అని బైబిలు పిలుస్తుంది. (లూకా 3:38) దేవుడు మనిషిని ఒక ఉద్దేశంతో సృష్టించాడు. పరలోక తండ్రితో స్నేహాన్ని పెంచుకుంటూ, భూమిమీద సంతోషంగా అభివృద్ధి చెందుతూ ఎప్పటికీ జీవిస్తూ ఉండాలనేదే ఆ ఉద్దేశం. అలా దేవునితో సంబంధం కలిగి ఉండే సామర్థ్యం మనుషులందరికీ ఉంటుంది, అంటే ఆయన గురించి తెలుసుకోవాలనే అనే కోరిక మనుషుల్లో సహజంగానే ఉంటుంది. అందుకే, బైబిలు ఇలా చెప్తుంది: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు సంతోషంగా ఉంటారు.”—మత్తయి 5:3.

బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “దేవుని వాక్యాన్ని విని, పాటించేవాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారు!” (లూకా 11:28) బైబిలు దేవుని గురించి తెలుసుకోవడానికే కాదు, ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని ఆనందించడానికి, భవిష్యత్తు వైపు ఆశతో ఎదురుచూడడానికి సహాయం చేస్తుంది.

బైబిలు ఇచ్చిన దేవుడు, మీరు

చాలా రుజువులను పరిశీలించాక, ప్రపంచంలో ఉన్న లక్షలమంది బైబిలు ఒక ప్రాచీన సాహిత్య రచన మాత్రమే కాదు అనే నిర్ణయానికి వచ్చారు. బైబిలు దేవుని ప్రేరణతో రాసిన పుస్తకం అని, ఆయన మనుషులతో దాని ద్వారా మాట్లాడుతున్నాడని వాళ్లు ఖచ్చితంగా నమ్ముతున్నారు. మీతో కూడా దేవుడు బైబిలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మీరు తెలుసుకోవాలని, ఆయనకు స్నేహితులు అవ్వాలని దేవుడు మిమ్మల్ని బైబిలు ద్వారా ఆహ్వానిస్తున్నాడు. “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు” అని బైబిలు మాటిస్తుంది.—యాకోబు 4:8.

బైబిల్ని లోతుగా చదివితే ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది. ఏంటది? మీరు ఒక పుస్తకాన్ని చదివినప్పుడు దాని రచయిత మనసు మీకు తెలుస్తుంది. అదేవిధంగా బైబిలు చదివితే దాని రచయిత అయిన దేవుని ఆలోచనలు, భావాలు మీకు తెలుస్తాయి. దానివల్ల మీకు కలిగే ప్రయోజనాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఆలోచనలు, భావోద్వేగాలు తెలుసుకోగలరు. బైబిల్లో ఇంకా ఈ విషయాలు గురించి ఉంది:

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు. వాళ్లు డబ్బులు తీసుకోకుండా మీరు బైబిలు నేర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు మీరు బైబిలు రచయిత అయిన యెహోవా దేవునితో మరింత దగ్గరి సంబంధాన్ని పెంచుకుంటారు.

బైబిలు దేవుని ప్రేరణతో రాసిందని చూపించే కొన్ని రుజువుల గురించి ఈ ఆర్టికల్‌లో చదివాం. ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 2వ అధ్యాయం చూడండి. ఆ పుస్తకాన్ని www.ps8318.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు లేదా ఈ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు

www.ps8318.com వెబ్‌సైట్‌లో ఉన్న బైబిలుకు మూలం ఎవరు? అనే వీడియో కూడా చూడవచ్చు

ప్రచురణలు > వీడియోలు చూడండి

a బైబిల్లో దేవుని పేరు యెహోవా అని ఉంది.—కీర్తన 83:18.