కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎడమ: 1930లలో అమెరికాలోని అలబామాలో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ ఇచ్చిన ప్రసంగాన్ని వినిపిస్తున్న ఒక సహోదరి; కుడి: స్విట్జర్లాండ్‌

1వ భాగం

రాజ్యం గురించిన సత్యం—ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడం

రాజ్యం గురించిన సత్యం—ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడం

మీరు మీ బైబిలు విద్యార్థితో కలిసి ఒక లేఖనం చదివారు. దాని అర్థాన్ని గ్రహించగానే, మీ విద్యార్థి ముఖం వెలిగిపోతూ ఉంది. “అంటే మనం ఇదే భూమ్మీద పరదైసులో నిత్యం జీవిస్తామా?” అని అతను ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు మీతోపాటు పరిచర్య చేస్తున్న సహోదరుడు చిన్నగా నవ్వి, “అవును. మనం ఇప్పుడు బైబిల్లో చూసింది అదే కదా?” అన్నాడు. “నమ్మలేకపోతున్నాను, నాకు ఇంతవరకు ఎవ్వరూ ఈ విషయం చెప్పలేదు!” అని ఆ విద్యార్థి అన్నాడు. కొన్ని వారాల క్రితం, దేవుని పేరు యెహోవా అని తెలుసుకున్నప్పుడు కూడా అతను ఇలాగే స్పందించాడు.

మీకెప్పుడైనా అలాంటి అనుభవం ఎదురైందా? చాలామంది సహోదరసహోదరీలకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. సత్యం తెలుసుకోవడం ఎంత అమూల్యమైన బహుమానమో అవి మనకు గుర్తుచేస్తూ ఉంటాయి. ఒక్కక్షణం ఆగి ఆలోచించండి: ఆ సత్యం మనకెలా చేరింది? దానికి జవాబును ఈ భాగంలో పరిశీలిస్తాం. దేవుని ప్రజలు క్రమక్రమంగా ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవడాన్ని బట్టి, దేవుని రాజ్యం వాస్తవమైనదని రుజువౌతోంది. ఆ రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు, వంద సంవత్సరాలుగా దేవుని ప్రజలకు సత్యం అందేలా చూస్తున్నాడు.

ఈ భాగంలో

3వ అధ్యాయం

యెహోవా తన సంకల్పాన్ని క్రమక్రమంగా వెల్లడి చేశాడు

రాజ్యం దేవుని మొదటి సంకల్పంలో భాగమా? రాజ్యానికి సంబంధించిన వివరాల్ని యేసు ఎలా వెల్లడి చేశాడు?

4వ అధ్యాయం

యెహోవా తన పేరును ఘనపర్చుకోవడం

దేవుని పేరును పవిత్రపర్చడంలో దేవుని రాజ్యం ఇప్పటికే ఏమి సాధించింది? యెహోవా పేరును పవిత్రపర్చడంలో మీరు వ్యక్తిగతంగా ఎలా భాగం వహించవచ్చు?

5వ అధ్యాయం

రాజ్యానికి సంబంధించిన సత్యాలపై రాజు వెలుగు ప్రసరింపజేశాడు

రాజ్యం గురించి, దాని పరిపాలకుల గురించి, దాని పౌరుల గురించి తెలుసుకోండి. అలాగే రాజ్యానికి విశ్వసనీయంగా ఉండడం అంటే ఏమిటో పరిశీలించండి.