కీర్తనలు 24:1-10

  • మహిమగల రాజు ద్వారాల గుండా ప్రవేశిస్తాడు

    • ‘భూమి యెహోవా సొంతం’ (1)

దావీదు కీర్తన. శ్రావ్యగీతం. 24  భూమి, దానిలో ఉన్న ప్రతీది,లోకం, దాని నివాసులు యెహోవా సొంతం.+   ఎందుకంటే, ఆయనే సముద్రాల మీద దాన్ని స్థిరంగా నిలిపాడు,+నదుల మీద దాన్ని స్థిరపర్చాడు.   యెహోవా పర్వతానికి ఎవరు ఎక్కగలరు?+ఆయన పవిత్ర స్థలంలో ఎవరు నిలబడగలరు?   నా జీవం తోడని* అబద్ధ ప్రమాణం చేయకుండా,మోసపూరితంగా ఒట్టు వేయకుండా,+నిర్దోషమైన చేతులు, స్వచ్ఛమైన హృదయం కలిగినవాళ్లే కదా.+   వాళ్లు యెహోవా నుండి ఆశీర్వాదాలు,+తమ రక్షకుడైన దేవుని నుండి నీతిని* పొందుతారు.   ఆయన్ని వెదికే తరం ఇదే,యాకోబు దేవా, నీ అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించేవాళ్లు వీళ్లే. (సెలా)   మహిమగల రాజు ప్రవేశించేలా+ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి;+ప్రాచీన గుమ్మాల్లారా, తెరుచుకోండి!   మహిమగల ఈ రాజు ఎవరు? బలవంతుడూ యోధుడూ అయిన యెహోవా,+యుద్ధ శూరుడైన యెహోవా.+   మహిమగల రాజు ప్రవేశించేలాద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి;ప్రాచీన గుమ్మాల్లారా, తెరుచుకోండి! 10  మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యాలకు అధిపతైన యెహోవా. ఆయనే మహిమగల ఈ రాజు.+ (సెలా)

అధస్సూచీలు

ఇది యెహోవా జీవాన్ని సూచిస్తుంది.
లేదా “న్యాయాన్ని.”