కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ పాట

మన దేవుడైన యెహోవాను స్తుతించండి!

మన దేవుడైన యెహోవాను స్తుతించండి!

(కీర్తన 145:12)

  1. 1. రారండి, సన్నుతిద్దాము,

    మన దేవుని పేరును.

    చాటుదాం మానవాళికి

    ఆయనిచ్చే దీవెనలను.

    క్రీస్తు రాజయ్యే కాలమిదని

    యెహోవా నిర్ణయించాడు.

    సమీపించింది అంతము అని

    హెచ్చరిద్దాం ప్రజలను.

    (పల్లవి)

    రారండి, సన్నుతిద్దాము,

    మన తండ్రి గొప్పతనాన్ని.

  2. 2. రారండి, ఆలపిద్దాము,

    తండ్రికి స్తుతి చెల్లిద్దాం.

    ప్రార్థన ఆలకించేటి

    యెహోవాను కొనియాడుదాం.

    సర్వసృష్టికి కారకుడైనా,

    యెహోవా వినయస్థుడు.

    కరుణగల మన దేవుడు

    వింటాడు మన ప్రార్థన.

    (పల్లవి)

    రారండి, సన్నుతిద్దాము,

    మన తండ్రి గొప్పతనాన్ని.