కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

124వ పాట

ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

ఎల్లప్పుడూ యథార్థంగా ఉందాం

(కీర్తన 18:25)

  1. 1. అనునిత్యం యెహోవాకు

    నమ్మకంగా ఉందాము.

    ఆయనిచ్చే ఆజ్ఞలన్నీ

    సంతోషంగా పాటిద్దాం.

    ఎన్నడూ తప్పిపోనివి

    దేవుని సలహాలు.

    యెహోవాపై నమ్మకాన్ని

    ఉంచితే ఎంతో మేలు.

  2. 2. అనునిత్యం సాక్షులకు

    నమ్మకంగా ఉందాము.

    సాయం చేస్తూ ఎల్లప్పుడూ

    అండగా నిలుద్దాము.

    వాళ్లపై నమ్మకముంచి,

    గౌరవం చూపిద్దాము.

    మాటల్లోను, చేతల్లోను

    దయగా నడుద్దాము.

  3. 3. అనునిత్యం పెద్దలిచ్చే

    ఉపదేశం విందాము.

    వాళ్లు ఇచ్చే నిర్దేశాల్ని

    వినయంగా పాటిద్దాం.

    కుమ్మరిస్తాడు యెహోవా

    మెండుగా దీవెనలు.

    నమ్మకంగా ఉండేవాళ్లే

    ఆయనకు పిల్లలు.