కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

137వ పాట

నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు

నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు

(రోమీయులు 16:2)

  1. 1. శారా, ఎస్తేరు, రూతు ఇతరులు

    సమర్థవంతులు, మంచి భార్యలు.

    దైవభక్తే వాళ్ల జీవిత లక్ష్యం,

    రాసున్నాయి వాళ్ల పేర్లు బైబిల్లో.

    విశ్వాసం చూపిన స్త్రీలెందరో;

    పేర్లు లేవు గానీ దైవామోదం ఉంది.

  2. 2. ధైర్యం, విశ్వాసం, దయ, మంచితనం

    పెట్టాడు మనలో యెహోవా తండ్రి.

    గుర్తుకొస్తాయి ఈ సుగుణాలన్నీ,

    చూసినప్పుడు ఈ స్త్రీల ఆదర్శం.

    మనకాలంలో సహోదరీలు

    మనకందరికీ ఆదర్శప్రాయులు.

  3. 3. తల్లి, కుమార్తె, భార్య, సోదరీలు;

    ఉన్నారు కొందరు ఒంటరివాళ్లూ.

    సంతోషంగా ప్రయాసపడతారు,

    అణకువతో లోబడివుంటారు.

    సోదరీల్లారా, వీడండి భయం;

    యెహోవా మెచ్చాడు, బహుమతి మీదే.