కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

65వ పాట

ముందుకు సాగిపోదాం!

ముందుకు సాగిపోదాం!

(హెబ్రీయులు 6:1)

  1. 1. సంపూర్ణులమౌతూ సాగిపోదాము.

    పరిచర్యలో పెంచుకుందాము ప్రావీణ్యం.

    శక్తికై దేవుణ్ణి వేడుకుంటూనే,

    నీతికై కృషిచేద్దాం.

    యేసులానే మనం అందరం

    సువార్త ప్రకటిస్తూ ఉందాం.

    సత్యపు వెలుగు ప్రకాశించేలా,

    జ్యోతుల్లా బ్రతుకుదాం.

  2. 2. ధైర్యంగా ప్రకటిస్తూ సాగిపోదాం.

    నిత్యసువార్త అందరికీ చాటిద్దాము.

    దేవుని వర్తమానాన్ని అందిస్తూ,

    సత్యాన్ని బోధిద్దాము.

    శత్రువులు భయపెట్టినా,

    వెనుతీయక ప్రకటిద్దాం.

    యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూ మనం,

    ఇంటింటా ప్రకటిద్దాం.

  3. 3. కోత విస్తారంగా ఉంది కాబట్టి,

    మన సామర్థ్యాన్ని మరింత పెంచుకుందాం.

    పవిత్రశక్తికై దేవున్నర్థిస్తూ,

    సంతోషంతో సేవిద్దాం.

    ప్రజల్ని ప్రేమతో కలుస్తూ,

    మనసు మారేలా బోధిద్దాం.

    ప్రగతి సాధిస్తూ సాగిపోయేలా,

    నిత్యమూ సాయం చేద్దాం.

(ఫిలి. 1:27; 3:16; హెబ్రీ. 10:39 కూడా చూడండి.)