కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

70వ పాట

అర్హుల్ని వెదకండి

అర్హుల్ని వెదకండి

(మత్తయి 10:11-15)

  1. 1. సువార్త పని నేర్పించాడు యేసు,

    నిర్దేశాలెన్నో ఇచ్చాడు:

    ‘దేవుని నిర్దేశం కోసం తపించే

    వాళ్లను వెదకండి మీరు.

    ఇంటిలో ఉన్న వాళ్లు అర్హులైతే,

    మీ శాంతి వెళ్తుంది వాళ్లకు.

    కానీ వాళ్లు వెళ్లిపొమ్మని అంటే,

    శాంతంగా వచ్చేయండి మీరు.’

  2. 2. ఇంటివాళ్లు చేర్చుకుంటే మిమ్మల్ని,

    చేర్చుకున్నట్టే ఆయన్ని.

    సరైన మనసున్న వాళ్లందరూ

    సేవచేస్తారు మీతో కల్సి.

    చింతించకండి ఏం మాట్లాడాలని,

    యెహోవాయే చేస్తాడు సాయం.

    దయ చూపిస్తూ మాట్లాడే మాటలు

    ఆకట్టుకుంటాయి దీనుల్ని.

(అపొ. 13:48; 16:14; కొలొ. 4:6 కూడా చూడండి.)