కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

99వ పాట

వేవేల సహోదరులు

వేవేల సహోదరులు

(ప్రకటన 7:9, 10)

  1. 1. వేవేల సహోదరులు

    విశ్వసనీయులు;

    లక్షలలో ఉన్నారు

    గొప్ప సమూహము.

    వేవేల సోదరులం,

    కీర్తిద్దాం దేవుణ్ణి.

    వచ్చాం మనం ప్రతి దేశము,

    భాష, తెగ నుండి.

  2. 2. వేవేల సహోదరులం,

    ప్రకటిస్తున్నాము

    ‘సువర్తమానం’ గూర్చి

    ప్రతి ఒక్కరికీ.

    ఆ పని చేస్తుండగా

    అలసిపోతుంటాం.

    యేసు ఎంతో గొప్ప విశ్రాంతి

    ఇస్తాడు మనకు.

  3. 3. వేవేల సహోదరులం,

    దేవుని ముందున్నాం;

    ఆయన ఆలయంలో

    సేవ చేస్తున్నాము.

    రాజ్యసువార్త గూర్చి

    ప్రకటిస్తూ మనం,

    తండ్రి జతపనివారిగా

    సేవచేస్తూ ఉందాం.