కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2017

జూలై 31 నుండి ఆగస్టు 27, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి.

కష్టాలన్నిటిలో యెహోవా మనల్ని ఓదారుస్తాడు

భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావచ్చు? ఒకవేళ మీరు అలాంటి సమస్యలతో ఎదుర్కొంటుంటే దేవుడిచ్చే ఓదార్పును ఎలా పొందవచ్చు?

ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి

మనం ఏ సంపదను విలువైనదిగా ఎంచాలి? అలా ఎంచుతున్నామని ఎలా చూపిస్తాం?

పైరూపాన్ని కాకుండా హృదయాన్ని చూడగలరా?

వీధిలో అపరిశుభ్రంగా ఉంటూ, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వని పీటర్‌తో ఒక యెహోవాసాక్షి ఓపిగ్గా మాట్లాడడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?

మీరు గొడవల్ని పరిష్కరించుకొని సమాధానాన్ని కాపాడగలరా?

ప్రజలు సమాధానాన్ని ఎంతగానో కోరుకుంటారు. అయినప్పటికీ, తమ స్థానాన్ని కోల్పోయేలా ఉన్నప్పుడు లేదా తమ అహం దెబ్బతిన్నప్పుడు, చాలామంది సమాధానాన్ని పాడుచేసే విధంగా ప్రవర్తించడం మొదలుపెడతారు. మరి అలా కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండవచ్చు?

‘మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి!’

ఈ మాటలు ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన దావీదు అబీగయీలును మెచ్చుకుంటూ అన్నవి. దావీదు అబీగయీలును ఎందుకు మెచ్చుకున్నాడు? ఆమె ఉదాహరణ నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంపై మనసుపెట్టండి

మనుషులు అందరూ ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమిటి? దానిగురించి మీరెందుకు తెలుసుకొని ఉండాలి?

యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి

యెహోవాను ఈ విశ్వానికి పరిపాలకునిగా గుర్తించడం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

మీకిది తెలుసా?

యెరూషలేము దేవాలయంలో జంతువుల వ్యాపారం చేస్తున్నవాళ్లను ‘దొంగలు’ అని యేసు ఎందుకు పిలిచాడు?