కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

దేవుని సంస్థ నుండి ఏదైనా నిర్దేశం వచ్చినప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకులు, సంఘపెద్దలు వంటి బాధ్యతగల సహోదరులు ఏమి చేయాలి?

వాళ్లు ఆ నిర్దేశాన్ని వెంటనే పాటించాలి. వాళ్లు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవాకు నమ్మకంగా ఉండమని తోటి సహోదరసహోదరీల్ని ప్రోత్సహిస్తున్నానా? దేవుని సంస్థ నుండి వచ్చే నిర్దేశాల్ని పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నానా?’—w16.11, 11వ పేజీ.

నిజక్రైస్తవులు మహాబబులోనుకు ఎప్పుడు బందీలయ్యారు?

చివరి అపొస్తలుడు చనిపోయిన వెంటనే నిజక్రైస్తవులు మహాబబులోనుకు బందీలయ్యారు. అప్పుడు సంఘంలోని కొంతమంది అబద్ధ ఆలోచనల్ని బోధించడం మొదలుపెట్టారు. కొంతమంది మతగురువులుగా చెలామణి అయ్యారు. చర్చి, రోమా ప్రభుత్వం మతభ్రష్ట క్రైస్తవత్వాన్ని ప్రోత్సహించాయి. అవి శిష్యుల్ని సత్యం నుండి దూరం చేయాలనుకున్నాయి. కానీ 1914 కన్నా ముందు సంవత్సరాల నుండి అభిషిక్తులు మహాబబులోనును విడిచి రావడం మొదలుపెట్టారు.—w16.11, 23-25 పేజీలు.

‘శరీర విషయాల మీద’ మనసుపెట్టేవాళ్లకు, ‘ఆత్మ విషయాల మీద’ మనసుపెట్టేవాళ్లకు మధ్య తేడా ఏమిటి? (రోమా. 8:6)

‘శరీర విషయాల మీద’ మనసుపెట్టేవాళ్లు పాపపు కోరికల గురించే ఆలోచిస్తూ, వాటి ప్రకారమే జీవిస్తూ, వాటి గురించే మాట్లాడుతూ తమకు ఇష్టమొచ్చిన వాటిని చేస్తారు. ‘ఆత్మ విషయాల మీద’ మనసుపెట్టేవాళ్లు దేవుని గురించి, ఆయన ఉద్దేశాల గురించే ఆలోచిస్తారు. అలాంటి క్రైస్తవులు, పవిత్రశక్తి తమ మనసుల్ని నిర్దేశించే అవకాశాన్ని ఇస్తారు. శరీర విషయాల మీద మనసుపెట్టడం మరణానికి దారితీస్తుంది, ఆత్మ విషయాల మీద మనసుపెడితే జీవాన్ని, సమాధానాన్ని సంపాదించుకుంటాం.—w16.12, 15-17 పేజీలు.

ఆందోళనను తగ్గించుకోవడానికి కొన్ని సలహాలు ఏమిటి?

అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయాలకు మొదటిస్థానం ఇవ్వండి, మీరు చేయగలిగే వాటిగురించి ఆలోచించండి, సేదదీరడానికి ప్రతీరోజు కొంత సమయం కేటాయించండి, యెహోవా సృష్టిని ఆస్వాదించండి, కాస్త చమత్కారంగా ఉండండి, క్రమంగా వ్యాయామం చేయండి, సరిపడా నిద్రపోండి.—w16.12, 22-23 పేజీలు.

“మరణము చూడకుండునట్లు” హనోకు ఎలా కొనిపోబడ్డాడు? (హెబ్రీ. 11:5)

బహుశా యెహోవా హనోకుకు ఎలాంటి బాధ, నొప్పి లేకుండా మరణించేలా చేసుంటాడు.—wp17.1, 12-13 పేజీలు.

అణకువ ఎందుకు ప్రాముఖ్యం?

అణకువగల వ్యక్తికి తన గురించి తనకు తెలుసని, తాను చేయలేనివి లేదా చేయకూడనివి కొన్ని ఉన్నాయని గుర్తిస్తాడు. అందుకే మన ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపిస్తుందని గుర్తుంచుకొని మనగురించి మనం ఎక్కువగా ఊహించుకోకూడదు.—w17.01, 18వ పేజీ.

యెహోవా నేడున్న పరిపాలక సభను నడిపిస్తున్నట్లుగానే మొదటి శతాబ్దంలో కూడా నడిపించాడని ఎలా చెప్పవచ్చు?

పవిత్రశక్తి సహాయంతో వాళ్లు లేఖన సత్యాల్ని గ్రహించారు. దూతల సహాయంతో వాళ్లు ప్రకటనాపనిని పర్యవేక్షించారు, ఇతరులకు నిర్దేశం ఇస్తున్నప్పుడు దేవుని వాక్యంపై ఆధారపడ్డారు. నేడు పరిపాలక సభ సభ్యులు కూడా అదే చేస్తున్నారు.—w17.02, 26-28 పేజీలు.

వేటిని బట్టి విమోచన క్రయధనం అమూల్యమైనదని మనం గుర్తించవచ్చు?

నాలుగు విషయాలు: ఆ బహుమానం ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఆ బహుమానం ఇవ్వడానికి వాళ్లు ఏమి త్యాగం చేశారు? ఆ బహుమానం ఏ అవసరాన్ని తీర్చింది? ఈ నాలుగు ప్రశ్నల గురించి మనం లోతుగా ఆలోచించాలి.—wp17.2, 4-5 పేజీలు.

ఒక క్రైస్తవుడు తాను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవచ్చా?

మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. నీనెవె ప్రజలు తమ ప్రవర్తన మార్చుకుని, చెడును విడిచిపెట్టినప్పుడు యెహోవా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కొన్ని సందర్భాల్లో కొత్త పరిస్థితుల్ని బట్టి లేదా మనకు అందిన కొత్త సమాచారాన్ని బట్టి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాల్సి రావచ్చు.—w17.03, 16-17 పేజీలు.

ఇతరుల గురించి చెడుగా చెప్పడం ఎందుకు ప్రమాదకరం?

అది సమస్యను మరింత పెద్దదిగా చేయవచ్చు. మనం అనుకున్నది నిజమైనా కాకపోయినా, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల పరిస్థితి ఎన్నడూ మెరుగవ్వదని గుర్తుపెట్టుకోండి.—w17.04, 21వ పేజీ.