కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కృతజ్ఞత

కృతజ్ఞత

కృతజ్ఞత

కృతజ్ఞత చూపించడం వల్ల శారీరకంగా, మానసికంగా, భావోద్రేకపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని రుజువైంది. కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో రోజూ కృతజ్ఞత చూపించాలి.

కృతజ్ఞత మీరు క్షేమంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తుంది?

మెడికల్‌ సైన్స్‌ ఏమి చెప్తుంది . . .

Harvard Mental Health Letterలో ఉన్న ఒక ఆర్టికల్‌లో ఇలా ఉంది, “అధిక సంతోషానికి కృతజ్ఞత బలంగా, స్థిరంగా ముడిపడి ఉంది. కృతజ్ఞత మనుషులు భావోద్రేకపరంగా సంతోషంగా ఉండడానికి, మంచి అనుభవాలను ఆస్వాదించడానికి, మంచి ఆరోగ్యం పొందడానికి, కష్టాలను తట్టుకోవడానికి, సంబంధాలను బలంగా ఉంచుకోవడానికి సహాయం చేస్తుంది.”

దేవుడు ఏమంటున్నాడు . . .

కృతజ్ఞత చూపించే మనసును పెంచుకోమని దేవుడు చెప్తున్నాడు. కృతజ్ఞత విషయంలో మంచి ఉదాహరణ దేవుని సేవకుడైన పౌలు. ఆయన “కృతజ్ఞులై యుండుడి” అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్న విషయాలకు ప్రజలు చక్కగా స్పందించడం చూసి, ఆయన ‘మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.’ (కొలొస్సయులు 3:15; 1 థెస్సలొనీకయులు 2:13) ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే అప్పుడప్పుడు థాంక్యూ అని చెప్తే సరిపోదు, కృతజ్ఞతా స్వభావాన్ని పెంచుకోవాలి. ఇది మనల్ని కొన్ని చెడ్డ లక్షణాల నుండి కాపాడుతుంది. లేకపోతే మనం అన్నిటికి అర్హులమనే అహం చూపించేలా, ప్రత్యేకమైన వాళ్లమని అనుకునేలా, కుళ్లు, కోపం చూపించేలా చేస్తుంది. అప్పుడు మనకు అందరూ దూరంగా ఉంటారు, జీవితంలో సంతోషం ఉండదు.

కృతజ్ఞత చూపించడంలో మన సృష్టికర్త చాలా మంచి ఉదాహరణ. ఆయన సాధారణ మనుషులకు కూడా కృతజ్ఞత చూపిస్తాడు. హెబ్రీయులు 6:1లో “మీరు చేసిన కార్యమును, మీరు . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అని ఉంది. అవును, కృతజ్ఞత చూపించకపోతే మన సృష్టికర్త దాన్ని అవినీతిగా అన్యాయంగా భావిస్తాడు.

“ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; . . . ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.”1 థెస్సలొనీకయులు 5:15, 16.

కృతజ్ఞత ఇతరులతో ఉన్న సంబంధాలను ఎలా పెంచుతుంది?

అనుభవం ఏమి చూపిస్తుంది . . .

ఒక గిఫ్ట్‌కి, ఒక మంచి మాటకి, ఒక సహాయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపించినప్పుడు మనం అవతలివాళ్లు ఎంతో విలువైన వాళ్లని, మెచ్చుకోదగినవాళ్లని అనుకునేలా చేస్తాము. ఎవరైనా ఒక చిన్న పని చేసినందుకు, ఉదాహరణకు తలుపు తెరిచి పట్టుకున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తే, పరిచయం లేకపోయినా, వాళ్లు చక్కగా స్పందిస్తారు.

దేవుడు ఏమంటున్నాడు . . .

ఇతరులకు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి, అప్పుడు ప్రజలు మీకు తిరిగి ఇస్తారు అని దేవుని కుమారుడైన యేసు చెప్పాడు. “అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో” కొలుస్తారు అని ఆయన చెప్పాడు. (లూకా 6:38) రోజ్‌ ఉదాహరణ చూడండి, ఆమె సౌత్‌ పసిఫిక్‌లో వనౌటు ద్వీపంలో ఉంటుంది. ఆమెకు వినిపించదు, మాట్లాడలేదు.

రోజ్‌ యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లేది కానీ సరిగ్గా ప్రయోజనం పొందేది కాదు. ఎందుకంటే ఆమెకు గానీ ఆమె సంఘంలో వాళ్లకు గానీ సంజ్ఞా భాష రాదు. ఒకసారి సంజ్ఞా భాష బాగా తెలిసిన ఒక జంట ఆ సంఘానికి వచ్చారు. అక్కడున్న సమస్యను గమనించి ఒక సంజ్ఞా భాష క్లాస్‌ను మొదలుపెట్టారు. రోజ్‌ ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది. “నన్ను ప్రేమించే ఇంతమంది స్నేహితులు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది,” అని చెప్పింది. ఆమె కృతజ్ఞతను, మీటింగ్స్‌లో పాల్గొనడాన్ని చూస్తుంటే ఆ భాష నేర్పించిన జంటకు బహుమానం పొందినంత సంతోషంగా ఉంది. ఆమెతో మాట్లాడడానికి సంఘంలో వాళ్లు ఎంతో పట్టుదలతో సంజ్ఞా భాషను నేర్చుకుంటుంటే చూసి రోజ్‌ కృతజ్ఞతతో నిండిపోయింది.—అపొస్తలుల కార్యములు 20:35.

“స్తుతియాగము [కృతజ్ఞతలు] అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు.”కీర్తన 50:23.

మీరు కృతజ్ఞతా స్ఫూర్తిని ఎలా పెంచుకోవచ్చు?

దేవుడు ఏమంటున్నాడు . . .

మన ఆలోచనలు మన మనసుతో దగ్గరగా ముడిపడి ఉంటాయి. దేవుని గురించి రాసిన దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను.” (కీర్తన 143:5) అవును, దావీదు పరధ్యానంతో పైపైన ఆలోచించే వాడు కాదు. దేవుని పనులను ఎప్పటికప్పుడు ధ్యానించేవాడు కాబట్టే ఆయనకు ఆ కృతజ్ఞతా స్ఫూర్తి వచ్చింది. ఇది ఆయన జీవితాంతం పెంచుకుంటూ ఉన్న అలవాటు.—కీర్తన 71:5, 17.

బైబిలు మనకు ఈ అద్భుతమైన సలహా ఇస్తుంది: ఏవి నిజమైనవో, ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ప్రేమించదగినవో, ఏవి గౌరవప్రదమైనవో, ఏవి మంచివో, ఏవి పొగడదగినవో వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి. (ఫిలిప్పీయులు 4:8) ఆలోచిస్తూ లేదా ధ్యానిస్తూ ఉండండి అనే మాటలు ఎప్పటికప్పుడు అలాంటి స్వభావాన్ని పెంచుకుంటూ ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి. కృతజ్ఞతా స్ఫూర్తిని అలవాటు చేసుకోవడానికి అది ఎంతో ముఖ్యం. ◼ (g16-E No. 5)

“నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.”కీర్తన 49:3.