కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు సహాయంతో ఆయన శోధనను ఎదిరించాడు

బైబిలు సహాయంతో ఆయన శోధనను ఎదిరించాడు

బైబిలు సహాయంతో ఆయన శోధనను ఎదిరించాడు

నేడు ప్రపంచంలో శోధనలు విపరీతంగా ఉన్నాయి. బైబిలు ప్రమాణాలను పాటించడం అంత సులభం కాదు. ఉదాహరణకు, “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అనే బైబిలు ఉపదేశాన్ని పాటించడం సవాలుగా ఉండవచ్చు.​—⁠1 కొరింథీయులు 6:​18.

సబాస్టిన్‌ అని మనం పిలిచే ఒక యెహోవాసాక్షి పోలాండ్‌లోని ఒక స్కాండినేవియన్‌ కంపెనీలో పనిచేశాడు. ఆయన తన యథార్థతను కాపాడుకోవడానికి గట్టిగా పోరాడాల్సివచ్చింది.

సబాస్టిన్‌ ఒక యెహోవాసాక్షి అని ఆయన సహోద్యోగులందరికీ తెలుసు. ఆయన కష్టపడి పనిచేయడాన్ని, ఆయన నడవడిని చూసిన ఆయన సూపర్‌వైజర్లు మెచ్చుకొని ఆయనకు వివిధ పైబాధ్యతలను అప్పగించారు. అయితే ఈ పైబాధ్యతల్లో సందేహాత్మకమైన వినోదకలాపాలతో నిండివుండే వ్యాపార సమావేశాలు కూడా ఉండేవి.

త్వరలోనే సబాస్టిన్‌లో సందేహాలు మొదలయ్యాయి. “నేనొక యెహోవాసాక్షిని అని మా బాసుకు తెలుసు. అందుకే ఆయన నన్ను నమ్మి నాకు బాధ్యత అప్పగించాడు. నేను పాల్గొనడానికి నిరాకరిస్తే నా ఉద్యోగం పోతుంది, ఇలాంటి ఉద్యోగం దొరకడం చాలా కష్టం. నేను కేవలం గమనించేవాడిగా ఉంటే ఏమవుతుంది?”

అంతకంటే ఎక్కువే చేయాల్సి ఉంటుందని సబాస్టిన్‌కు తర్వాత తెలిసింది. విదేశీ కస్టమర్ల “సేవ కోసం” అంటే, రాత్రుళ్ళు వారితో గడిపేందుకు “అమ్మాయిలను” ఏర్పాటు చేయడం కూడా తన బాధ్యతని అర్థమయింది. ఆయన ఏమి చేశాడు?

అనైతికత పట్ల తన బైబిలు ఆధారిత దృక్పథం ఏమిటో సూపర్‌వైజర్‌కు గుర్తుచేయాలని సబాస్టిన్‌ నిర్ణయించుకున్నాడు. అలాంటి పనులు చేయడానికి సబాస్టిన్‌ తగినవాడు కాదని ఎప్పుడో ఒకప్పుడు ఆయన తన ఉద్యోగాన్ని వదులుకోవలసిందేనని త్వరలోనే స్పష్టమైంది. ఆయనకు వేరే ఉద్యోగం దొరికింది, జీతం తక్కువే కానీ అక్కడ ఇలాంటి శోధనలు లేవు. ఆయనకు ఇప్పుడు నిష్కళంకమైన మనస్సాక్షి ఉంది.

అనైతికతలో పాల్గొనమని లేదా దాన్ని పట్టించుకోకుండా ఉండమని ఎవరైనా ఒత్తిడి చేస్తే మీరేమి చేస్తారు? గణనీయమైన మార్పులు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటారా? ఆదికాండము 39:​7-12లో నివేదించబడిన ప్రకారం పూర్వం యోసేపు అలాగే చేశాడు.