కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Oleh_Slobodeniuk/E+ via Getty Images

మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు

మన భూమి ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు

“మనం అనుకున్నదానికన్నా భూమి చాలా బలమైంది.”

ఈ మాటలు, వాతావరణ మార్పుల గురించి పరిశోధన చేసిన కొంతమంది అంతర్జాతీయ పరిశోధకులు అన్నవి. మనుషుల బాగోగులు పట్టించుకునే సృష్టికర్త ఉన్నాడని మీరు నమ్ముతారా? ఒకవేళ నమ్మితే, పరిశోధకులు అన్న ఆ మాటలు వినగానే మీకేం గుర్తుకొచ్చింది? దేవుడు మన భూమిని దానంతటదే బాగు చేసుకునే సహజ ప్రక్రియలతో తయారు చేశాడనే విషయం గుర్తొచ్చి ఉండొచ్చు.

కానీ, మనుషులు భూమిని ఎంత పాడు చేశారంటే అది దాని సహజ సామర్థ్యంతో దానంతటదే మామూలు స్థితికి రాలేదు. అయితే దేవుడు భూమిని కాపాడడానికి ఏదోకటి చేస్తాడనే నమ్మకంతో మనం ఎందుకు ఉండవచ్చు?

భూమి అన్నిటిని తట్టుకోవడంతో పాటు, ప్రాణులతో కళకళలాడుతూ ఉంటుందనే నమ్మకాన్ని మనలో కలిగించే లేఖనాలు బాక్సులో ఉన్నాయి. ఒకసారి చూడండి.

  • మన భూమిని దేవుడు తయారుచేశాడు. “మొదట్లో దేవుడు ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు.” —ఆదికాండం 1:1

  • మన భూమికి యజమాని దేవుడు. ‘భూమి, దానిలో ఉన్న ప్రతీది యెహోవా a సొంతం.’ —కీర్తన 24:1

  • దేవుడు మన భూమిని అన్నిటిని తట్టుకుని నిలబడేలా చేశాడు. “ఆయన భూమిని దాని పునాదుల మీద స్థిరపర్చాడు; అది దాని చోటు నుండి ఎప్పటికీ కదిలించబడదు.”—కీర్తన 104:5

  • మన భూమి చిరకాలం ప్రాణులతో కళకళలాడుతూ ఉంటుందని దేవుడు మాటిచ్చాడు. ‘సత్యదేవుడు భూమిని నిర్మించాడు. ఆయన దాన్ని ఊరికే చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు.’—యెషయా 45:18

  • మనుషులు ఈ భూమ్మీద ఎప్పటికీ ఉంటారని దేవుడు మాటిచ్చాడు. “నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”—కీర్తన 37:29

మనుషులు భూమికి హాని చేయకుండా సంతోషంగా జీవించేలా దేవుడు దానిని తయారుచేశాడు. అయితే కొంతమంది వాళ్ల స్వార్థం కోసం భూమిని అడ్డూ-అదుపూ లేకుండా పాడుచేస్తున్నారు. అలాంటి వాళ్లను యెహోవా దేవుడు ఆయన నిర్ణయించిన సమయంలో ఖచ్చితంగా నాశనం చేస్తాడని బైబిలు ముందే చెప్పింది.—ప్రకటన 11:18

ఆ తర్వాత ఆయన మన భూమిని అందంగా, రవ్వంత కూడా కాలుష్యం లేని చూడచక్కని తోటలా మారుస్తాడని; అంతేకాదు ‘గుప్పిలి విప్పి ప్రతీ జీవి కోరికను తృప్తిపరుస్తాడని’ బైబిలు మాటిస్తోంది.—కీర్తన 145:16

a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.